జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం: ఆనందబాబు
విడిపోయిన రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లోనూ చంద్రబాబు అంచలంచెలుగా అభివృద్ధి చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: విడిపోయిన రాష్ట్రాన్ని లోటు బడ్జెట్లోనూ చంద్రబాబు అంచలంచెలుగా అభివృద్ధి చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఏకంగా 20 సంవత్సరాలు వెనక్కి పోయిందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. గుంటూరులో మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబు హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేస్తే.. వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాజధాని అమరావతిని నాశనం చేశారు. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా ఉన్నవాటిని తరిమేశారు. ఉద్యోగాలు, ఉద్యోగ ప్రకటనలు లేవు. యువతను నిర్వీర్యం చేశారు. విధ్వంసాలు, దోపిడీలు, అక్రమాలు, అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. నాలుగేళ్లలో రూ.తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టించడం చేతగాదు. ఒక లక్ష్యం లేదు’.. అని ఆనందబాబు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్