చంద్రబాబుపై రాజకీయ కుట్ర జరుగుతోంది
బ్లాక్ క్యాట్ కమాండోలను తొలగిస్తే తెదేపా అధినేత చంద్రబాబు ఫినిష్ అయిపోతారని శాసనసభ స్పీకర్ తమ్మినేని పేర్కొన్న నేపథ్యంలో డీజీపీ తక్షణం కుట్ర కేసు నమోదు చేసి తమ్మినేని సహా బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళవారం డీజీపీకి రాసిన లేఖలో సూచించారు.
డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ
ఈనాడు,అమరావతి: బ్లాక్ క్యాట్ కమాండోలను తొలగిస్తే తెదేపా అధినేత చంద్రబాబు ఫినిష్ అయిపోతారని శాసనసభ స్పీకర్ తమ్మినేని పేర్కొన్న నేపథ్యంలో డీజీపీ తక్షణం కుట్ర కేసు నమోదు చేసి తమ్మినేని సహా బాధ్యులందరిపైనా చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళవారం డీజీపీకి రాసిన లేఖలో సూచించారు. ‘తమ్మినేని హెచ్చరికతో చంద్రబాబుపై పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది...’ అని వర్ల పేర్కొన్నారు. ‘చంద్రబాబుపై దాడి చేసే విధానం ఎలాగంటే.. ముందు ఆయనపై దాడి చేస్తామని బెదిరిస్తారు.. రెండో దశలో ఆయన టూర్ రూట్ మ్యాప్‌ను ఆధారంగా చేసుకుని చివరి నిమిషంలో కౌంటర్ ప్రోగ్రాంకు ప్లాన్ చేస్తారు. మూడో దశలో వైకాపా రౌడీలను, గూండాలను, అసాంఘిక శక్తులను కూడగట్టి కాన్వాయ్‌ను వెంబడించి గందరగోళం సృష్టిస్తారు. నాలుగో దశలో వైకాపా గూండాలతో కాన్వాయ్, తెదేపా మద్దతుదారులపై రాళ్ల దాడి చేయిస్తారు. చివరి దశలో.. పోలీసులు దాడి చేసిన వారిని వదిలిపెట్టి తెదేపా నాయకులు, కార్యకర్తలపై బలమైన సెక్షన్లు ప్రయోగించి కేసులు పెడతారు...’ అని వర్ల పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
వివేక్ రామస్వామితో డిన్నర్ అవకాశం
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!