మేనిఫెస్టో పేరుతో మోసం చేసేందుకు తెదేపా యత్నం: మంత్రి జోగి రమేష్‌

మహానాడులో తెదేపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అధికారం కోసం ప్రజలను మోసం చేసేలా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు.

Published : 31 May 2023 04:55 IST

తిరుపతి(నగరం), న్యూస్‌టుడే: మహానాడులో తెదేపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అధికారం కోసం ప్రజలను మోసం చేసేలా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. మంగళవారం తిరుపతిలో జరిగిన గృహనిర్మాణ ప్రగతిపై సమీక్షలో ఆయన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘చంద్రబాబునాయుడు 2014లో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం పది హామీలు కూడా అమలు చేయలేదు. వచ్చే ఎన్నికల కోసం అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు తెదేపా ప్రకటించింది. ఒంటరిగానే పోటీ చేసి వైకాపా 151 సీట్లకు పైగా సాధించడం ఖాయం...’ అని పేర్కొన్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు జగనన్న కాలనీల పేరుతో దాదాపు 22 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి జోగి రమేష్‌ వెల్లడించారు. జులై నాటికి ఐదు లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని