కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వం.. అసదుద్దీన్‌ ఒవైసీ

దిల్లీలో పెత్తనం కోసం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేంద్రంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చేది లేదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు.

Published : 01 Jun 2023 04:16 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: దిల్లీలో పెత్తనం కోసం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేంద్రంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చేది లేదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌కు, భాజపాకు ఎలాంటి తేడా లేదన్నారు. ఆర్టికల్‌ 370 అంశంలో భాజపా సర్కారుకు మద్దతిచ్చిన కేజ్రీవాల్‌ తన వరకు వచ్చే సరికి ఇతరుల మద్దతు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై దిల్లీ పోలీసులు, కేంద్ర సర్కారు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి మెదక్‌ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో, బుధవారం దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒవైసీ ప్రసంగించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై వేధింపులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శంషాబాద్‌లో ఇల్లు కట్టించుకున్నారు.. భాజపా తరఫున రాజకీయం చేసేందుకు ఇక్కడే ఉండనున్నారు.. ఓ పారిశ్రామికవేత్త ఇల్లు నిర్మించారు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. తెలంగాణాలో మజ్లిస్‌ అన్ని ప్రాంతాలకు వెళ్తుందని, మద్దతివ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని