కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం: భట్టి విక్రమార్క

తెలంగాణ ఉద్యమ లక్ష్యాల సాధనకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు రావడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated : 01 Jun 2023 05:30 IST

పెద్దకొత్తపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమ లక్ష్యాల సాధనకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు రావడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర కొనసాగింది. దేదినేనిపల్లిలో ఆయన మాట్లాడుతూ... ‘‘భాజపా, భారాసలు ఒక్కటేననే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. భారాస నాయకులు ప్రాజెక్టుల పేరిట దోపిడీకి పాల్పడుతున్నా... కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదు? మేం అధికారంలోకి రాగానే కృష్ణా, గోదావరి నదులపై కాంగ్రెస్‌ హయాంలో మొదలైన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. కల్వకుర్తి ఎత్తిపోతల పంట కాల్వలను మొదటి ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి జలాశయాన్నీ పూర్తి చేసి కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతాం. ఉద్యోగాల భర్తీతోపాటు నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి చెల్లిస్తాం. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ డా.మల్లు రవి మాట్లాడుతూ...  వచ్చే ఎన్నికల్లో భారాసకు పది సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని