మున్సిపల్‌ కార్యాలయానికి వైఎస్సార్‌ పేరుకు తీర్మానం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయానికి వైఎస్సార్‌ పేరును పెట్టేందుకు బుధవారం పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో వైకాపా సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు.

Published : 01 Jun 2023 04:38 IST

తిరస్కరణ నోటీసు ఇచ్చిన తెదేపా కౌన్సిలర్లు

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయానికి వైఎస్సార్‌ పేరును పెట్టేందుకు బుధవారం పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో వైకాపా సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. తెలుగుదేశం కౌన్సిలర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఎన్టీఆర్‌ పేరును ఖరారు చేశామని, నూతన ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండు చేస్తూ తిరస్కరణ నోటీసును ఛైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మికి అందజేశారు. దీంతో వైకాపా, తెదేపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగి ప్రతిపాదన నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని