స్థానిక సంస్థల్లో 75 ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 75 జిల్లా పరిషత్, పురపాలక ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్మన్లు, డిప్యూటీ మేయర్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉపసర్పంచుల స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసింది.
జూన్ 8న పరోక్ష పద్ధతిలో ఎన్నిక
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న 75 జిల్లా పరిషత్, పురపాలక ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్మన్లు, డిప్యూటీ మేయర్, మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఉపసర్పంచుల స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసింది. పరోక్ష పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం జూన్ 4లోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సమాచారం అందించి 8న చేతులెత్తే విధానంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో ఉప మేయర్, ధర్మవరం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్, తెనాలి, నర్సీపట్నం, నూజివీడు పురపాలక సంఘాల్లో వైస్ ఛైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, చిత్తూరు జిల్లా రామకుప్పం, సత్యసాయి జిల్లా బట్టలపల్లి, నెల్లూరు జిల్లా రాపూరు, అన్నమయ్య జిల్లా గలివేడు మండల పరిషత్ అధ్యక్షుల స్థానాలతోపాటు మరో తొమ్మిది మండలాల్లో మండల పరిషత్ ఉపాధ్యక్షులు, మరో రెండు జిల్లాలో రెండు కో-ఆప్షన్ సభ్యుల స్థానాలకు, ఇంకో 18 జిల్లాల్లో 53 ఉప సర్పంచుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్