వైకాపా మేనిఫెస్టో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సోమిరెడ్డి

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.7 శాతం నెరవేర్చామని డబ్బాలు కొట్టుకుంటున్న సీఎం జగన్‌...ధరల పెరుగుదల, సహజవనరుల దోపిడీ, కల్తీ మద్యం విక్రయాలు లాంటి ఇవ్వని హామీల్నీ సైతం నెరవేర్చారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Published : 01 Jun 2023 04:38 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.7 శాతం నెరవేర్చామని డబ్బాలు కొట్టుకుంటున్న సీఎం జగన్‌...ధరల పెరుగుదల, సహజవనరుల దోపిడీ, కల్తీ మద్యం విక్రయాలు లాంటి ఇవ్వని హామీల్నీ సైతం నెరవేర్చారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  తెదేపా తొలి మేనిఫెస్టోపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రులు.. వైకాపా మేనిఫెస్టో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలు మరీ సంస్కారహీనంగా ఉన్నాయని మండిపడ్డారు. మద్యపాన నిషేధం సహా పది అంశాలపై బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు