ముందస్తుకు వెళితే.. జగన్‌ ముందుగానే ఇంటికి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని, అలాగైతే ఆయన ముందుగానే ఇంటికి వెళ్లిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

Published : 01 Jun 2023 04:38 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాఖపట్నం (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని, అలాగైతే ఆయన ముందుగానే ఇంటికి వెళ్లిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. బుధవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వివేకా హత్య కేసును మూడేళ్లుగా దర్యాప్తు చేస్తూ సీబీఐ తీవ్ర అప్రతిష్ఠ మూటగట్టుకుందన్నారు. ఏపీకి చాలా చేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ నోటితో చెబుతారన్నారు. ప్రధాని మోదీ అంటే భయంతోనే.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా తెదేపా, వైకాపా నాయకులు చెప్పడం లేదన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్‌ మోదీ భజన చేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని