రాష్ట్రంలో నాలుగేళ్లుగా అరాచక పాలన: సత్యకుమార్‌

రాష్ట్రంలో నాలుగేళ్లుగా అరాచకపాలన కొనసాగుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు.

Updated : 01 Jun 2023 05:57 IST

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో నాలుగేళ్లుగా అరాచకపాలన కొనసాగుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తున్నా జగన్‌ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు మంజూరుచేసినా స్థల కేటాయింపులు లేక వెనక్కి వెళ్తున్నాయన్నారు. విజయవాడ, విశాఖ నగరాలకు మెట్రో ప్రాజెక్టులు కేటాయించినా ప్రతిపాదనలు కూడా పంపించకపోవడంతో వెనక్కి వెళ్లాయని విమర్శించారు. పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. జగన్‌ చేతకానితనంతో ఏపీలో నిరుద్యోగం పెరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రూ.19 వేల కోట్లు ఇచ్చామన్నారు. కేంద్రం రాష్ట్రానికి సంక్షేమ పథకాల పేరిట నిధులు ఇస్తున్న విషయాన్ని కాదనగలరా అంటూ సవాలు విసిరారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంస్కరణలతో ప్రపంచదేశాలన్నీ మన వైపు చూసేలా దేశం ఎదిగిందన్నారు. భాజపా పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని