పొత్తులపై చంద్రబాబు, పవన్‌లదే నిర్ణయం
అన్ని రంగాల్లో దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే విషయంలో తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకాభిప్రాయంతో ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
ఇప్పటికే పలుమార్లు తెదేపా, జనసేన మధ్య చర్చలు
యువగళం పాదయాత్రలో లోకేశ్
ఈనాడు డిజిటల్, కడప: అన్ని రంగాల్లో దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే విషయంలో తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకాభిప్రాయంతో ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పొత్తులపై వారిద్దరిదే తుది నిర్ణయమని, ఈ మేరకు పలుమార్లు చర్చలు సైతం జరిపారని తెలిపారు. వైయస్‌ఆర్ జిల్లాలో యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జమ్మలమడుగు నియోజకవర్గం సలివెందులలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి నుంచి వెనక్కి తీసుకుని పేదలకు పంచిపెడతామని, ఈ మేరకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇసుక ద్వారా వైకాపా రూ.ఐదారు వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పార్టీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల పనితీరును బట్టి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ‘భవిష్యత్తుకు భరోసా’ పేరిట మహానాడులో ప్రకటించిన పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమమే కొలమానంగా ఇన్‌ఛార్జులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇచ్చేది, లేనిదీ చంద్రబాబు తేలుస్తారన్నారు. కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టిన నేతలు తిరిగొస్తామంటే రావచ్చని, వారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తామంటే మాత్రం వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా బృహత్తర ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 2019 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆదాయం వ్యత్యాసం రూ.4 వేల కోట్లు ఉంటే.. ప్రస్తుతం అది రూ.40 వేల కోట్లకు పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సొంత నియోజకవర్గానికి గానీ, వైయస్‌ఆర్ జిల్లాకు గానీ చివరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. రుణమాఫీపై హామీ ఇవ్వబోమని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల భరతం పడతామని, చిత్తూరు ఎస్పీ అంతు తేలుస్తామని లోకేశ్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. 112వ రోజున పాదయాత్ర జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పాదయాత్రలో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, నేతలు లింగారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, పుత్తా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్ పాదయాత్రపై డిజిటల్ పుస్తకం
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహానాడులో ఆవిష్కరించిన ‘జన హృదయమైనారా లోకేశ్’ పుస్తకాన్ని బుధవారం డిజిటల్ రూపంలో విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)