వైకాపా నేతల్లో వణుకు: కన్నా
మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన తొలి విడత మేనిఫెస్టోతో వైకాపా నేతల వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: మహానాడులో చంద్రబాబు ప్రవేశపెట్టిన తొలి విడత మేనిఫెస్టోతో వైకాపా నేతల వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులోని ఆయన నివాసంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘మహిళా శక్తిని మహాశక్తిగా తయారు చేసేందుకు చంద్రబాబు పూనుకొంటే వైకాపా నేతలకు నిద్ర పట్టడం లేదు. రైతన్నల పెట్టుబడికి రూ.20,000, నిరుద్యోగులకు రూ.3,000, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఇవి ట్రయల్ రన్ మాత్రమే. నాలుగేళ్ల బూతుల పాలన తప్ప చెప్పుకోవడానికి మీకు ఏమైనా ఉందా. రూపాయి అప్పు తెచ్చి పావలా ఇచ్చి, ముప్పావలా జేబులో వేసుకోవడం కాదు’ అని విమర్శించారు.
సత్తెనపల్లి తెదేపా ఇన్‌ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి తెదేపా ఇన్‌ఛార్జిగా మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.