‘తెదేపా మేనిఫెస్టోతో వైకాపా నేతల గుండెల్లో రైళ్లు’

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమను వృద్ధి చేశారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, తెరాస ముఖ్యమంత్రులు దాన్ని కొనసాగించడంతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని అమరావతి దళిత ఐకాస నేత పులి చిన్నా అన్నారు.

Published : 01 Jun 2023 04:52 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమను వృద్ధి చేశారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, తెరాస ముఖ్యమంత్రులు దాన్ని కొనసాగించడంతోనే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని అమరావతి దళిత ఐకాస నేత పులి చిన్నా అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం శిబిరంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. మహానాడులో తెదేపా ప్రకటించిన మేనిఫెస్టోను హర్షిస్తూ శిబిరం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం చేశారు. చిన్నా మాట్లాడుతూ.. మినీ మేనిఫెస్టో విడుదలతో వైకాపా నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు 1261వ రోజుకు చేరాయి. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని