లోకేశ్‌ పాదయాత్ర ఫ్లెక్సీల చించివేత

నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి బుధవారం పాదయాత్ర చేరుకోగా.. తెదేపా నేతలను రెచ్చగొట్టే ప్రకటనలతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Published : 01 Jun 2023 04:52 IST

ఈనాడు డిజిటల్‌, కడప: నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి బుధవారం పాదయాత్ర చేరుకోగా.. తెదేపా నేతలను రెచ్చగొట్టే ప్రకటనలతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పాదయాత్ర మార్గంలో అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు సిమెంటు రోడ్డు నిర్మాణం పేరిట రాకపోకలకు అంతరాయం కలిగేలా చేశారు. యాత్ర మార్గంలో వసంతపేటలో కంకర, ఇసుక పోశారు. తెదేపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళవారం రాత్రి చించేశారు. దీనిపై తెదేపా నేత సీఎం సురేష్‌నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసి, తిరిగి కొత్తవి ఏర్పాటు చేశారు. మరోవైపు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి బెయిల్‌ వచ్చిన సందర్భంగా ఈశ్వరాలయంలో గురువారం అభిషేకం నిర్వహిస్తామని, ఆ సేవకు రావాలంటూ ఎమ్మెల్యే రాచమల్లు శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతకుముందు నేతలంతా భేటీ కావాలని నిర్ణయించారు. ఇలాంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, బాలిశెట్టి శ్రీనివాసులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని