జగన్ ఉన్మాద చర్యలతో నగుబాటు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖ్యాతి ఖండాంతరాల్లో వెలుగొందుతుంటే... సీఎం జగన్ ఉన్మాద చర్యలు దేశం నగుబాటుకు కారణం కావచ్చని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖ్యాతి ఖండాంతరాల్లో వెలుగొందుతుంటే... సీఎం జగన్ ఉన్మాద చర్యలు దేశం నగుబాటుకు కారణం కావచ్చని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒక పార్లమెంటు సభ్యుడిని చితకబాదిన ఘటనను మిలటరీ ఆసుపత్రి ధ్రువీకరించగా, సుప్రీంకోర్టు తన తీర్పులో ఉటంకించిందన్నారు. ఈ ఘటనపై పార్లమెంటరీ సభాహక్కుల సంఘం ఇప్పటివరకు విచారణ చేపట్టలేదన్నారు. అదే సమయంలో జగన్ అరాచకాలను అమెరికా పౌరహక్కుల సంఘం ప్రస్తావించిందన్నారు. తనతో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లపై రాజద్రోహం కేసులు మోపడం, వాట్సప్ సందేశాన్ని ఫార్వర్డ్ చేసిన రంగనాయకమ్మ అనే వృద్ధురాలిని సీబీఐ పోలీసులు వేధించడం, నలంద కిశోర్, డాక్టర్ సుధాకర్‌లను ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించిన తీరు పసిఫిక్ సముద్రతీరంలో ఉన్నవారి చెవులకు చేరిందని వివరించారు. ఏపీ సీఐడీ అరాచకాలపై తాను జాతీయ మానవహక్కుల సంఘాన్ని రెండుసార్లు సంప్రదించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల సంఘంలో కనీసం టైప్ చేసే గుమాస్తా లేరన్నారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘనను అమెరికా సంస్థ బయటకు తెచ్చినందున ఆ సంస్థపై సీఐడీ పోలీసులు కేసులు పెడతారా అని రఘురామ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)