నవంబరులో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: తరుణ్‌ఛుగ్
వచ్చే నవంబరులో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ ధీమా వ్యక్తంచేశారు.
ఈనాడు, దిల్లీ: వచ్చే నవంబరులో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం ఆర్మూర్‌కు చెందిన పైడి రాకేష్‌రెడ్డి.. ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో భాజపాలో చేరగా.. తరుణ్‌ఛుగ్ తన నివాసంలో కాషాయ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్న అవినీతి, కుటుంబపాలనను అంతంచేసే శక్తి భాజపాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. భారాసను రూపుమాపే వ్యాక్సిన్ భాజపానే అని అర్వింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేల్లో మూడొంతుల మంది పార్టీ ఫిరాయించారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు గెలిచినా, ప్యాకేజీ మాట్లాడుకొని వెళ్లిపోతారని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన బహుళ అంతస్తుల భవనాలు
-
Phonepe appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్
-
ఎక్స్ ఇండియా హెడ్ రాజీనామా.. కారణమిదేనా?
-
Cricket News: సిరాజ్ స్పెషల్ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!
-
Chandrababu Arrest: చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్ష కొనసాగిస్తా: కాలవ శ్రీనివాసులు
-
TS Election: చురుగ్గా ఏర్పాట్లు.. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు?