కేసీఆర్ పాలనలో వలస కూలీలైన గ్రామీణ యువత
ఉన్నత చదువులు చదివిన గ్రామీణ యువత ఉద్యోగాలు లేక హైదరాబాద్‌లో వలస కూలీలుగా మారుతున్నారని, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌లకు మాత్రం పదవులు దక్కాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
సీఎల్పీ నేత భట్టి విమర్శ
లింగాల, న్యూస్‌టుడే: ఉన్నత చదువులు చదివిన గ్రామీణ యువత ఉద్యోగాలు లేక హైదరాబాద్‌లో వలస కూలీలుగా మారుతున్నారని, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులైన కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌లకు మాత్రం పదవులు దక్కాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘2018లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పులపాల్జేశారు. రూ.42 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.1.20 లక్షల కోట్లకు పెంచారు. అదనంగా ఒక ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హామీ ఇచ్చారు. మండలంలోని అంబడిపల్లి, అవుసలికుంట నుంచి లింగాల మీదుగా సాగిన పాదయాత్రకు నాయకులు ఘనస్వాగతం పలికారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభం
-
Nitin Gadkari : హైడ్రోజన్ బస్సులో ప్రయాణించిన నితిన్ గడ్కరీ
-
Narayana: మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Delhi: బైక్ దొంగల వెనుక ఉగ్ర నెట్వర్క్.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!
-
Angallu case: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ