అవినాష్‌రెడ్డికి బెయిలుపై సుప్రీంకు వెళతా

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు వ్యవహారంపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడు బుద్ధా వెంకన్న అన్నారు.

Published : 02 Jun 2023 04:32 IST

తెదేపా నేత బుద్ధా వెంకన్న

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు వ్యవహారంపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడు బుద్ధా వెంకన్న అన్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లకపోయినా.. తాను వెళ్తానని అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో 2019 ఎన్నికల్లో తెదేపాపై అభియోగం మోపి వైకాపా అధికారంలోకి వచ్చిందని, తమ పార్టీకి నష్టం జరిగినందున ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళతానని వెంకన్న స్పష్టం చేశారు. అమరావతి భూముల్లో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించిన సీఎం జగన్‌ విశాఖలో వైకాపా నేతలు అడ్డగోలుగా కబ్జా చేసిన భూముల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యారంలో 600 ఎకరాల భూములను మంత్రి అమర్‌నాథ్‌, విజయసాయిరెడ్డి కలిసి దోచుకున్నారని ఆరోపించారు. తెదేపా పాలనలో ఇక్కడి భూముల్లో కొన్ని ఎకరాలను ఎస్సీలకు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఈ విషయంలో తాము పూర్తి వివరాలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని, అందుకు వైకాపా నేతలు సిద్ధమేనా అంటూ సవాల్‌ విసిరారు.  స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని