‘నవ భారత్‌’కు చిహ్నంగా సెంగోల్‌ ప్రతిష్ఠాపన: సీపీఎం

హిందూ దేశాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ‘సెంగోల్‌’ చేతపట్టుకుని పార్లమెంటులో మతపెద్దలతో కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇది ‘నవ భారత్‌’కు చిహ్నమని సీపీఎం విమర్శించింది.

Published : 02 Jun 2023 04:32 IST

దిల్లీ: హిందూ దేశాన్ని తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ‘సెంగోల్‌’ చేతపట్టుకుని పార్లమెంటులో మతపెద్దలతో కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇది ‘నవ భారత్‌’కు చిహ్నమని సీపీఎం విమర్శించింది. ఈ మేరకు పార్టీ పత్రిక ‘పీపుల్స్‌ డెమోక్రసీ’లో సంపాదకీయం వెలువరించింది. ప్రధాని చర్య ప్రజాస్వామ్య సూత్రాలకు, లౌకికవాద ప్రజాతంత్ర గణతంత్ర సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. పార్లమెంటులో కీలకస్థానంలో మతపరమైన చిహ్నాన్ని ఉంచడం, వి.డి.సావర్కర్‌ జయంతి రోజునే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం సరికాదంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, దిల్లీలో సెంట్రల్‌ విస్టా పనులు, కొత్త పార్లమెంటు భవనం.. ఇవన్నీ ‘నిరంకుశవాద హిందుత్వ దేశా’నికి చిహ్నాలుగా పేర్కొంది. ప్రభుత్వ వాదనకు తగ్గట్టుగా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని