ఆస్తి పన్ను పెరగదని ప్రభుత్వం హామీ ఇవ్వాలి
భూముల విలువలు పెంచినప్పుడల్లా.. పుర, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్ను పెరగదనే హామీని ప్రజలకు ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్
ఈనాడు-అమరావతి: భూముల విలువలు పెంచినప్పుడల్లా.. పుర, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్ను పెరగదనే హామీని ప్రజలకు ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు ప్రశ్నించారు. కొత్త ఆస్తి పన్ను విధానంతో ప్రజలపై ఏటా 15-30% భారం పెరుగుతుందని శాసన మండలిలో ప్రశ్నించినపుడు.. పన్ను భారం ఉండదని చెప్పిన పురపాలక శాఖ మంత్రి ప్రస్తుతం ఏం సమాధానం చెబుతారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఆరుసార్లు భూముల విలువలు పెంచారు. భూముల విలువల పెంపుతో స్థిరాస్తి వ్యాపారం దెబ్బతింటుందని క్రెడాయ్ వంటి సంస్థలు మొత్తుకున్నా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో స్తిరాస్థి రంగం పూర్తిగా చతికిల పడింది. భూముల విలువల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి’ అని అశోక్‌బాబు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nijjar Killing: నిజ్జర్ హత్యపై ఆరోపణలు.. కెనడాతో టచ్‌లోనే ఉన్నాం: అమెరికా
-
OMG 2 ott release date: ఓటీటీలో అక్షయ్ ‘ఓఎంజీ2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vishal: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు ఎమర్జెన్సీ మీటింగ్..!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభం
-
Nitin Gadkari : హైడ్రోజన్ బస్సులో ప్రయాణించిన నితిన్ గడ్కరీ