రేవంత్‌లా పార్టీలు మారడం నాకు చేతకాదు: సంజయ్‌

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలా పార్టీలు మారడం, ఓటుకు నోటు వ్యవహారాలు తనకు చేతకాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

Published : 03 Jun 2023 06:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలా పార్టీలు మారడం, ఓటుకు నోటు వ్యవహారాలు తనకు చేతకాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. తనకు పార్టీని నడపడం చేతకాదని ఇటీవల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారని పేర్కొంటూ దానిపై ఆయన స్పందించారు. శుక్రవారం భాజపా కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని ఏ విధంగా నడిపిస్తున్నారో కాంగ్రెస్‌ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలను అడిగితే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో భాజపా గెలుపు పరంపరను కొనసాగిస్తుంటే కాంగ్రెస్‌ ఓటమి పరంపరను కొనసాగిస్తూ డిపాజిట్లే గల్లంతు చేసుకుంటోందన్నారు.

రాష్ట్రంలో భాజపా ఎక్కడుందనే మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ... సీఎం కేసీఆర్‌ను అడగాలని కేటీఆర్‌కు సూచించారు. భాజపానే లేదనే వాళ్లకు జీహెచ్‌ఎంసీ, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలే సమాధానమన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదని, వాళ్లకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదన్నారు. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిదే ఈ గొప్పతనమన్నారు. వేడుకలు అధికారికంగా నిర్వహించేలా ఆయన కేంద్రాన్ని ఒప్పించారన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని