లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే కాంగ్రెస్‌కు లాభం: ఎంపీ ఉత్తమ్‌

రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని భావిస్తున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 03 Jun 2023 04:41 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని భావిస్తున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రెండూ ఒకేసారి వస్తే కాంగ్రెస్‌కు లాభమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘ 2018 నుంచి రాజకీయాలు చాలా వ్యాపారాత్మకంగా మారాయి. ఇలాంటివి చూస్తే ఒక్కోసారి రాజకీయాల నుంచే తప్పుకోవాలన్న భావన కలుగుతోంది. తెలంగాణలో భాజపా ప్రభావం తగ్గుతోంది. ఆ పార్టీలో లోపలివారు, బయటివారి మధ్య పంచాయితీ నడుస్తోంది’’ అని అన్నారు. కాంగ్రెస్‌లో వైతెపా అధ్యక్షురాలు షర్మిల చేరికపై ప్రస్తావించగా.. ఆ విషయం తనకు తెలియదని, తమ పార్టీ పెద్దలు ఎవరో ఆమెతో మాట్లాడినట్టు అనిపిస్తోందన్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుపై స్పందిస్తూ.. శరత్‌చంద్రారెడ్డి నిజంగా అప్రూవర్‌గా మారితే ఆమ్‌ ఆద్మీ పార్టీకి చావుదెబ్బ అవుతుందని అభిప్రాయపడ్డారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని