కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నెరవేరని లక్ష్యాలు

తొమ్మిదేళ్ల భారాస పాలనలో ఆత్మగౌరవం, భావస్వేచ్ఛ కోల్పోయామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 03 Jun 2023 04:41 IST

బల్మూర్‌, న్యూస్‌టుడే:  తొమ్మిదేళ్ల భారాస పాలనలో ఆత్మగౌరవం, భావస్వేచ్ఛ కోల్పోయామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రలో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డిప్యూటీ స్పీకర్‌గా తనవంతు పాత్ర పోషించానన్నారు. దశాబ్దాల పోరాటాన్ని గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజలకు కల నెరవేర్చారన్నారు. దళిత, గిరిజనుల అభ్యున్నతికి తెచ్చిన ఉప ప్రణాళిక నిధుల మళ్లింపు, మైనార్టీ శాఖను పూర్తిగా నీరుగార్చి నిధులు కేటాయించకపోవడం భారాస చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. అనేక చట్టాలకు పేదలకు అండగా ఉంటే ధరణి తెచ్చి భూహక్కులు కోల్పోయేలా చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యాగాలు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు. భూమి లేని పేదలకు ఏడాదికి రూ. 12 వేలు అందిస్తామన్నారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు