ఆర్డినెన్సుపై ఆప్‌కు జేఎంఎం మద్దతు

దేశ రాజధాని దిల్లీలోని పరిపాలన విభాగాలపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకించడంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి అండగా ఉంటామని ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) శుక్రవారం లాంఛనప్రాయంగా ప్రకటించింది.

Published : 03 Jun 2023 04:44 IST

రాంచీ: దేశ రాజధాని దిల్లీలోని పరిపాలన విభాగాలపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును వ్యతిరేకించడంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి అండగా ఉంటామని ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) శుక్రవారం లాంఛనప్రాయంగా ప్రకటించింది. రాంచీలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌.. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ముగ్గురు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఓటింగుకు రానున్న ఈ ఆర్డినెన్సును విపక్షాలన్నీ ఒకటైతే తప్పనిసరిగా ఓడించవచ్చని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజాస్వామ్యంపై కేంద్రం చేస్తున్న దాడి తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని హేమంత్‌ సోరెన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని