కోడెల కుటుంబానికి న్యాయం జరుగుతుంది

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరాంకు పార్టీ తప్పక న్యాయం చేస్తుందని, కోడెల కుటుంబాన్ని తప్పక గౌరవించాల్సిందేనని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Published : 03 Jun 2023 04:47 IST

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరాంకు పార్టీ తప్పక న్యాయం చేస్తుందని, కోడెల కుటుంబాన్ని తప్పక గౌరవించాల్సిందేనని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్నికలకు ముందా.. తర్వాతా అనేది త్వరలోనే తేలుతుందని తెలిపారు. ఫౌండేషన్లు, ట్రస్టుల పేర్లతో ఈ మూడు, నాలుగు నెలల నుంచి పార్టీలోకి వచ్చేవారిది హడావుడేనని పేర్కొన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భాష్యం ప్రవీణ్‌కు.. చిలకలూరిపేటకు సంబంధం ఏంటి? ఆయనకు అక్కడ ఓటే లేదు. ట్రస్టులు, ఫౌండేషన్ల పేరుతో వచ్చే వారు రేపు సీటివ్వకపోతే కనపడతారా? ఒకవేళ గెలిస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. పార్టీ కూడా ఇలాంటి వారి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. అసలు వీరంతా ఈ నాలుగేళ్లు ఏమయ్యారు? ఇలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినవారు, కేసులు పెట్టించుకున్న వారు ఏమవుతారు? కష్టపడి పనిచేసే వారిని చంద్రబాబు తప్పక గుర్తిస్తారు. వారికి అన్యాయం జరగదు. సమర్థత ఉన్నవారికి, యువతకు కచ్చితంగా సీటు ఇవ్వాలి. కొత్తగా వచ్చి హడావుడి చేసేవారి ట్రాక్‌ రికార్డును పరిశీలించాలి’ అని పుల్లారావు పేర్కొన్నారు. సీనియర్లు పార్టీ కోసం కష్టపడుతున్నారని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు