వ్యవసాయ యాంత్రీకరణ శూన్యం... దేశంలో అట్టడుగున రాష్ట్రం
అసత్యాలు, అర్ధసత్యాలతో పబ్బం గడిపే సీఎం జగన్ సంక్షేమం ముసుగులో రైతుల గొంతుకోస్తున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు.
భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: అసత్యాలు, అర్ధసత్యాలతో పబ్బం గడిపే సీఎం జగన్ సంక్షేమం ముసుగులో రైతుల గొంతుకోస్తున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీతో యంత్రాలు, వ్యవసాయ ఉపకరణాల కొనుగోలుకు నిధులిస్తుంటే... రాష్ట్రంలో పంపిణీ మాత్రం గుండుసున్నా అని ట్విటర్ వేదికగా శుక్రవారం ఎద్దేవా చేశారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం పేరుతో గుంటూరులో జగన్ కొత్తనాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.
‘‘2014-19 మధ్య రైతులకు అందజేసిన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల సంఖ్య 2,51,514..2019-23 మధ్య పంపిణీయే లేదు. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా యంత్ర పరికరాల బాడుగ తీసుకునే విషయంలోనూ ఏపీ అట్టడుగు స్థానంలో ఉంది. ఏపీకి కేంద్రం సూక్ష్మసేద్యం కింద ఇచ్చిన నిధులు రూ.615 కోట్లు, బిందు సేద్యం కోసం ఇచ్చింది రూ.2,550 కోట్లు. అందులో రైతులకు అందింది శూన్యం. ఈ నిధులన్నీ ఎవరు మింగారో? ఎక్కడ దాచారో? ఇప్పటికే రైతు భరోసా పేరుతో రైతులకు రూ.అయిదు వేల కోట్లు అందించలేదు. పంటల బీమా సక్రమంగా అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టికొట్టారు. మద్దతు ధర ఇవ్వకుండా, ధాన్యం సేకరించకుండా తీరని అన్యాయం చేశారు..’’ అని సత్యకుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు
-
ODI World Cup: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి అగర్ ఔట్.. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడికి చోటు