లోకేశ్‌కు హాని జరిగితే జగన్‌దే బాధ్యత

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏ రకంగా హాని జరిగినా దానికి సీఎం జగన్‌దే బాధ్యతని తెదేపా నేతలు పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 05:36 IST

యువగళానికి భద్రత పెంచాలి
తెదేపా నేతల డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి : తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏ రకంగా హాని జరిగినా దానికి సీఎం జగన్‌దే బాధ్యతని తెదేపా నేతలు పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని, యువగళానికి ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైకాపా రౌడీలు ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘‘లోకేశ్‌ పాదయాత్రకు భద్రత పెంచాలి. దీని గురించి డీజీపీని కలుస్తాం. గురువారం జరిగిన దాడిని ప్రజలే తిప్పికొట్టారు...’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యక్ష దాడులతో పాదయాత్రను ఆపలేరని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ చెప్పారు.  ‘‘రాజకీయ ఉన్మాదంతో విర్రవీగుతున్న అధికారులు, వైకాపా సైకోలు అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.  చట్టవ్యతిరేకంగా వ్యవహరించే వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు...’’ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు