ఎన్నికలకు ముందే ‘తల్లికి వందనం’ టోకెన్లు
రాష్ట్రంలో అన్నివిధాలా సంపద సృష్టిస్తూ పేదల కోసం ప్రకటించిన ప్రతి సంక్షేమ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్నివిధాలా సంపద సృష్టిస్తూ పేదల కోసం ప్రకటించిన ప్రతి సంక్షేమ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో శనివారం పార్టీ శ్రేణులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలులో భాగంగా అర్హులైన పిల్లలందరికీ (ఇంటిలో ఎంతమంది ఉంటే అంత మందికీ) ఎన్నికలకు ముందుగానే టోకెన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అర్హులందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి కొందరికే పరిమితం చేశారని, నిబంధనల సాకుతో ఏటేటా కోత పెడుతున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్