Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్‌: రఘురామ

రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమైన సీఎం జగన్‌.. తన బాబాయ్‌ వై.ఎస్‌.భాస్కరరెడ్డికి జైల్లో ప్రత్యేక హోదా (సౌకర్యాలు) వచ్చేలా దిల్లీ పెద్దలను ఒప్పించగలిగారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 04 Jun 2023 08:44 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమైన సీఎం జగన్‌.. తన బాబాయ్‌ వై.ఎస్‌.భాస్కరరెడ్డికి జైల్లో ప్రత్యేక హోదా (సౌకర్యాలు) వచ్చేలా దిల్లీ పెద్దలను ఒప్పించగలిగారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. త్వరలోనే ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ప్రజలకు తీర్పును ఇచ్చే అవకాశం లభిస్తుందన్నారు. సీఎం జగన్‌ నిబంధనలు అతిక్రమిస్తూ కేంద్ర సర్వీసుల్లోని జూనియర్‌ కేడర్‌ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి కీలక బాధ్యతలు కట్టబెడుతుంటే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రశ్నించరా అన్నారు. తితిదే ఈవో పోస్టు ఐఏఎస్‌ అధికారుల హక్కని, ఆ పోస్టులో ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్‌ సర్వీస్‌ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ధర్మారెడ్డిని నియమించారన్నారు. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఐఏఎస్‌ అధికారిని నియమించాల్సి ఉండగా 2009 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి రామకృష్ణకు కట్టబెట్టడం సరికాదన్నారు. భీమవరం నుంచి పోటీచేయాలని పవన్‌ను కోరుతున్నట్లు చెప్పారు. మంచి మనిషిని ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని, ఈ దఫా ఆయనకు 60 వేలకు పైగా మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు