లోకేశ్‌ ప్రాణాలకు ముప్పు: వర్ల రామయ్య

యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తుల నుంచి ప్రాణహాని పొంచి ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 04 Jun 2023 03:39 IST

పాదయాత్రకు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తుల నుంచి ప్రాణహాని పొంచి ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్‌కు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని.. ప్రొద్దుటూరులో కోడిగుడ్లు, పాల ప్యాకెట్లతో దాడి జరుగుతుందని వారికి ముందే తెలిసినా రక్షణ కల్పించలేకపోయారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి శనివారం ఆయన లేఖ రాశారు. ‘‘ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతో తెదేపా అధినేత చంద్రబాబును అగౌరవపరిచేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా..వారు బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా డీఎస్పీ నాగరాజు, ఎస్‌ఐలు ఫ్లెక్సీ పెట్టడాన్ని సమర్థించారు. పోలీసుల్లో ఓ వర్గం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. దాడులు చేస్తున్న వారి వెనుక పోలీసులు ఉండటం దురదృష్టకరం. యువగళానికి భద్రత పెంచాలి. దాడులకు కారణమైన వారిపై, వారి వెనకున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని