Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్‌, చంద్రబాబు చర్చించుకుంటారు’

రాష్ట్రంలో సీట్ల సర్దుబాట్లపై తమ నాయకుడు పవన్‌కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు చర్చించుకుంటారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Updated : 04 Jun 2023 06:55 IST

తెనాలి నుంచే పోటీ చేస్తా: నాదెండ్ల మనోహర్‌

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సీట్ల సర్దుబాట్లపై తమ నాయకుడు పవన్‌కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు చర్చించుకుంటారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. తాను తెనాలి నుంచే పోటీచేస్తానని స్పష్టంచేశారు. తెనాలిని నమూనా నియోజకవర్గంగా తీర్చిదిద్దటం తన కల అని, దాన్ని సాకారం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం రానున్న ఎన్నికల్లో వైకాపా పాలనకు చరమగీతం పాడాల్సిందేనని చెప్పారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులను, వారి త్యాగాలను అవమానిస్తూ ప్రభుత్వం చేస్తున్న పనులు దారుణమని, వాటికి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. తామేదో సంక్షేమం చేస్తున్నామన్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని.. విద్యుత్తు బిల్లులు, పన్నులు, చలాన్లు, ధరల పెంపుతో ఇస్తున్నదాని కంటే అధికంగా ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని