కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని, తమ పార్టీతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆశయాలు నెరవేరుతాయని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 04 Jun 2023 06:15 IST

న్యూజెర్సీ సమావేశంలో రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించాలని, తమ పార్టీతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆశయాలు నెరవేరుతాయని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూజెర్సీలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ‘‘అనేక హామీలతో ప్రజలనునమ్మించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ కుటుంబం తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా పాలిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ దోపిడీని ఇంకెంత కాలం భరిద్దాం..? ప్రవాసాంధ్రులంతా కాంగ్రెస్‌తో కలిసి రావాలి’’ అని రేవంత్‌రెడ్డి కోరారు.

* ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై రేవంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సోనియా, మీరాకుమార్‌లను కేసీఆర్‌ అవమానించారు: వీహెచ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని, లోక్‌సభలో బిల్లు పాస్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఆనాటి స్పీకర్‌ మీరాకుమార్‌ను సీఎం కేసీఆర్‌ అవమానించారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవ ప్రసంగంలో కేసీఆర్‌ వారిద్దరి పేర్లు ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: అన్వేష్‌రెడ్డి

రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డితో కలిసి ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే 90 లక్షల ఎకరాలకు నీరందించారని, ఇప్పుడు దానికి అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వడం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని