ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించండి: కూనంనేని

రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు.

Updated : 04 Jun 2023 05:43 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. 2015లో క్రమబద్ధీకరణకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం ఓ ఉత్తర్వులో తెలిపినా.. అది పూర్తి కాలేదని ప్రస్తావించారు. అన్ని వర్సిటీల్లో మొత్తం 1,335 మంది ఉన్నారని, డిగ్రీ, పాలిటెక్నిక్‌ అధ్యాపకుల తరహాలోనే వీరినీ క్రమబద్ధీకరించాలని కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని