రాష్ట్రవ్యాప్తంగా త్వరలో తెదేపా బస్సుయాత్ర: కాసాని

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

Updated : 04 Jun 2023 06:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. రూట్‌ మ్యాప్‌, షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో కాసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. ‘‘ వెంటనే గ్రామ, మండల, డివిజన్ల కమిటీలను నియమించాలి. పార్టీ పునర్వైభవం లక్ష్యంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడాలి. ఇప్పటికీ ప్రజల గుండెల్లో తెదేపా బలంగా ఉంది. నాయకులు వీడినా కేడర్‌ అలాగే ఉంది. వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని పునర్నిర్మించాలి’’ అని సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని