గుత్తేదారుల జేబులు నింపేందుకే ప్యాకేజీ-21 రీడిజైన్‌

నాయకులు, గుత్తేదారుల జేబులు నింపేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-21లోని మంచిప్ప జలాశయ నిర్మాణాన్ని రీడిజైన్‌ చేసి రూ.కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 05 Jun 2023 04:04 IST

నిజామాబాద్‌ గ్రామీణం, మంచిప్ప, న్యూస్‌టుడే: నాయకులు, గుత్తేదారుల జేబులు నింపేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-21లోని మంచిప్ప జలాశయ నిర్మాణాన్ని రీడిజైన్‌ చేసి రూ.కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని మోపాల్‌, డిచ్‌పల్లి మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. మంచిప్పలోని కొండెం చెరువుపై 1.5 టీఎంసీల సామర్థ్యంతో అప్పట్లో జలాశయం నిర్మించడానికి రూ.1100 కోట్లు అంచనా వేస్తే.. భారాస సర్కారు రీడిజైన్‌ పేరుతో 3.5 టీఎంసీలకు, రూ.3,500 కోట్లకు బడ్జెట్‌ పెంచిందన్నారు. దీని వల్ల 3 గ్రామాలు, 9 తండాలు ముంపునకు గురవుతాయన్నారు. భూములు కోల్పోతున్న గిరిజనులు, ప్రజలు పోరాడుతోంటే వారిపై దౌర్జన్యంగా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని విమర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని