రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సీఎంకు చిత్తశుద్ధి ఏదీ?

ఒడిశాలో భారీ రైలు ప్రమాదమేర్పడినా ముఖ్యమంత్రి జగన్‌లో చలనం లేదని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు.

Updated : 05 Jun 2023 06:22 IST

మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఒడిశాలో భారీ రైలు ప్రమాదమేర్పడినా ముఖ్యమంత్రి జగన్‌లో చలనం లేదని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధానితో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి మానవత్వం చాటుకున్నారని వివరించారు. ఉత్తరాంధ్రలో ఎంతోమంది అనుభవజ్ఞులైన మంత్రులు ఉండగా కనీస అవగాహన లేని మంత్రి అమర్‌నాథ్‌ను పంపారంటేనే ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.


ఏపీలో హత్యా పాఠాలు

గోరంట్ల బుచ్చయ్యచౌదరి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: హైదరాబాద్‌ అభివృద్ధిలో దూసుకుపోతుంటే, ఏపీ మాత్రం జగన్‌రెడ్డి పాలనలో హత్యలెలా చేయాలి? ఏ విధంగా తప్పించుకోవాలి? అనే అంశాల చుట్టూనే తిరుగుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్‌ వైపు సీ, సీప్లస్‌, జావా, ఎస్‌క్యూఎల్‌ కోచింగ్‌ సెంటర్లు.. ఏపీ వైపు గొడ్డలిపోటు గుండెపోటుగా ఎలా చిత్రీకరించాలి? బెయిల్‌ ఎలా పొందాలి? సీబీఐ నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలపై నిపుణులైన ఫ్యాకల్టీతో కోచింగ్‌ సెంటర్లు.. రాష్ట్రం దుస్థితి ఇది’ అని ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు.


అమిత్‌షా పర్యటనను నిరసించాలి

వామపక్ష నేతల పిలుపు

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: 2014లో అధికారంలోకి వచ్చేందుకు భాజపా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా పలు హామీలు ఇచ్చి మాట తప్పిందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావులు ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలకు ఆరోపించారు. వివిధ రాష్ట్రాల ప్రజలనూ భాజపా ఇదే విధంగా మోసం చేసిందని, అలాంటి పార్టీ తొమ్మిది సంవత్సరాల పాలన అంటూ ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో ఈ నెల 8న జరిగే భాజపా బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్న నేపథ్యంలో.. ఆయన పర్యటనను నిరసించాలని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో భాజపా చేపట్టిన విద్రోహ చర్యలను ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని