భారాసను గద్దె దించేందుకే ‘పీపుల్స్‌ మార్చ్‌’: భట్టి

రాష్ట్ర ప్రజల సంపద దోచుకుంటున్న భారాస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Published : 05 Jun 2023 04:04 IST

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల సంపద దోచుకుంటున్న భారాస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్‌ గ్రామంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో మాట్లాడారు. పోడు భూములపై ఆధారపడి జీవించే అట్టడుగు వర్గాల ప్రజల కోసం నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అటవీహక్కుల చట్టాన్ని అమలు చేస్తే భారాస ప్రభుత్వం పోడు భూములను లాక్కుంటోందని విమర్శించారు. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పేదలు కలలుగన్న లక్ష్యాలు నెరవేరడం లేదని అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, అమ్రాబాద్‌ ఎంపీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని