Bandi Sanjay: తెదేపా, భాజపా పొత్తు వ్యవహారం.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తెదేపా, భాజపా పొత్తు ఖాయమైందంటూ మీడియాలో వస్తున్న ఊహాజనిత కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Updated : 05 Jun 2023 07:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా, భాజపా పొత్తు ఖాయమైందంటూ మీడియాలో వస్తున్న ఊహాజనిత కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కలిస్తే తప్పేంటి..? అని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుల హోదాలో మమతా బెనర్జీ, స్టాలిన్‌, నీతీశ్‌కుమార్‌లు కూడా మోదీ, అమిత్‌షాలను కలిశారని గుర్తు చేశారు. ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నేతలతో సంజయ్‌ మాట్లాడారు.

అమిత్‌ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబునాయుడు సమావేశమైన నేపథ్యంలో రెండు పార్టీలు పొత్తుకు సిద్ధమైనట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను పలువురు నాయకులు ఆయన వద్ద ప్రస్తావించగా.. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో భాజపా గ్రాఫ్‌ పెరుగుతుండటంతో దానిని దెబ్బతీసేందుకు భారాస, కాంగ్రెస్‌ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసే పోటీ చేస్తాయి.కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని పార్టీ నేతలకు ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని