వైకాపా కార్యక్రమంలో ఏఎన్‌యూ ప్రొఫెసర్‌

వైకాపా ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్‌’ కార్యక్రమం గుంటూరు హిందూ కళాశాలలోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు.

Published : 05 Jun 2023 05:01 IST

గుంటూరు (గోరంట్ల), న్యూస్‌టుడే: వైకాపా ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్‌’ కార్యక్రమం గుంటూరు హిందూ కళాశాలలోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపల్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొనడం చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్‌, చంద్రగిరి ఏసురత్నం, వైకాపా జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని