వారాహి యాత్రకు కమిటీలు.. సమీక్షించిన మనోహర్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టనున్న వారాహి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని ఆదివారం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

Published : 05 Jun 2023 05:01 IST

ఈనాడు, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టనున్న వారాహి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని ఆదివారం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాత్ర నిర్వహణ, సభల ఏర్పాట్లు, రూట్‌ మ్యాప్‌, మౌలిక సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సమావేశాలు నిర్వహించే అంశంపై నేతల మధ్య చర్చ జరిగింది. కమిటీలు వేసి, వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతమ్‌, ప్రోగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ కల్యాణం శివశ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, మల్లినీడి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు