ఏరువాక వచ్చినా.. ఎక్కడి ధాన్యం అక్కడే!

ఏరువాక పౌర్ణమి వచ్చినా రైతులు అరక పట్టలేని పరిస్థితి. ఎందుకంటే.. నేటికీ గత పంటను విక్రయించేందుకు మిల్లుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది.

Updated : 05 Jun 2023 06:23 IST

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: ఏరువాక పౌర్ణమి వచ్చినా రైతులు అరక పట్టలేని పరిస్థితి. ఎందుకంటే.. నేటికీ గత పంటను విక్రయించేందుకు మిల్లుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలోని రైస్‌ మిల్లు పరిసరాల్లో ధాన్యం ట్రాక్టర్లను చిత్రంలో చూడొచ్చు. రైతులు ధాన్యం లోడ్లు తీసుకొచ్చి మిల్లు పక్కనే ఉన్న ఖాళీ లేఅవుట్‌లో నిలిపి మూడు నుంచి 5 రోజుల పాటు ఎదురుచూస్తున్నారు. ఆదివారం అక్కడి రైతులను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కలిశారు. టీవీఎస్‌ వాహనం నడుపుతూ రైతుల వద్దకు వెళ్లారు. రైస్‌ మిల్లుల వద్ద కర్షకులు కాపురాలు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని