భారాస పాలనలో మహిళలపై పెరిగిన దాడులు

భారాస పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణా పూనియా ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులతో కలిసి సోమవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 06 Jun 2023 03:45 IST

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణా పూనియా

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భారాస పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణా పూనియా ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులతో కలిసి సోమవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 నుంచి రాష్ట్రంలో మహిళలకు అవమానం జరుగుతోందన్నారు. కేసీఆర్‌ దృష్టిలో మహిళ అంటే కేవలం తన కుమార్తె కవిత మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో చైన్‌ స్నాచింగ్‌లు, దాడులు, లైంగిక వేధింపులు పెరిగాయని ఆరోపించారు. భారాస ఎమ్మెల్యే వేధింపులు భరించలేక దిల్లీలో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. మద్యం నియంత్రణలో కేసీఆర్‌ సర్కారు విఫలమైందని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకంలో భారాస ఎమ్మెల్యేలు 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం గౌరవించడం లేదని కృష్ణా పూనియా విమర్శించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ధరణి వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని