రాష్ట్రాన్ని దోచుకుంటున్న భారాస

రాష్ట్రాన్ని భారాస దోచుకుంటోందని, ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

Published : 06 Jun 2023 03:45 IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సత్తుపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని భారాస దోచుకుంటోందని, ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్డు శివారులో వివాదాస్పదంగా మారిన భూమిని సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘కాకర్లపల్లిలో 30 ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని, పన్నులు చెల్లిస్తున్న పేదలకు అధికారులు అన్యాయం చేస్తున్నారు. బాధితులను రక్షించాల్సిన సత్తుపల్లి ఎమ్మెల్యే... భూకబ్జాదారులకు పరోక్షంగా మద్దతివ్వడం సరికాదు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయకుంటే మళ్లీ లీకేజీలు జరిగే ప్రమాదముంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఒక్కో ప్రభుత్వ ఉద్యోగాన్ని రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోం’’ అని స్పష్టంచేశారు. ఆయన వెంట నాయకులు బి.ఉపేంద్రసాహూ, శీలం వెంకటేశ్వరరావు, సుదర్శన్‌, సుభానీ, శ్రీనివాసరావు, ఈదర చంటి, చంద్రమోహన్‌ ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని