‘సింగరేణి’ని కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌దే: ఎమ్మెల్సీ కె.కవిత
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో సింగరేణి సంస్థను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
ఈనాడు, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో సింగరేణి సంస్థను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సింగరేణి బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్సీ కవిత సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు డిపెండెంట్ ఉద్యోగాలను సాధించుకున్నామని పేర్కొన్నారు. ‘‘కార్మికుల మంచి కోరే వ్యక్తిగా సీఎం కేసీఆర్.. కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా ప్రతినెలా ఉద్యోగులను తీసుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చారు. పురుషులకే కాకుండా కుమార్తెలు, కోడళ్లకు సైతం వారసత్వ ఉద్యోగావకాశాలు ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10 లక్షలను తెలంగాణ వచ్చాక రూ.25 లక్షలకు పెంచారు. సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు’’ అని ఎమ్మెల్సీ కవిత ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్