‘ముందస్తు’ ఆలోచన లేదు

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Published : 06 Jun 2023 04:34 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ, న్యూస్‌టుడే: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయన్నారు.  ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి వ్యతిరేకమని పేర్కొన్నారు. చంద్రబాబు దిల్లీ పర్యటనపై వైకాపా నాయకులు కంగారుపడుతున్నారని తెదేపా నాయకులు చేస్తున్న విమర్శలను విలేకరులు ప్రస్తావించగా.. ఒంటరిగా పోటీ చేయలేకే పొత్తులు కోసం దిల్లీ వెళ్లి దేహీ అని అడుగుతున్నారని విమర్శించారు. వామపక్షాలు కాకపోతే భాజపా, ఇలా ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. మేము ఆలోచించమని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు