జగన్‌ ఆజ్ఞ.. సజ్జల డైరెక్షన్‌లో దాడులు

రాష్ట్ర రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఆజ్ఞతో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయించారని, తమ పార్టీ కార్యాలయాలపై వైకాపా నాయకులు తెగబడడానికి కారణం ఆయనేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 06 Jun 2023 06:41 IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఈనాడు, నెల్లూరు: నేరవార్తలు, స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఆజ్ఞతో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయించారని, తమ పార్టీ కార్యాలయాలపై వైకాపా నాయకులు తెగబడడానికి కారణం ఆయనేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు విలేకర్లతో మాట్లాడడంతో పాటు.. ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. ‘ఆనంపై దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నా పోలీసులు తగిన విధంగా స్పందించలేదు. సుపారీ ఎవరు ఇచ్చారు? పోలీసులు నిగ్గు తేల్చాలి. సీఎం ఆజ్ఞ లేనిదే ఇలాంటి దాడులు జరగవు.. దీనికి ఎస్పీ, డీఐజీ, డీజీపీ సమాధానం చెప్పాలి’ అని దేవినేని అన్నారు. కర్రలతో తలలు పగలగొడుతుంటే.. స్టేషన్‌ బెయిల్‌ వచ్చేలా సెక్షన్లు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. దీనిపై ఇప్పటివరకు మంత్రి కాకాణి, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  

ముఖ్యమంత్రికి బెదరం: ఆనం వెంకటరమణారెడ్డి

‘ఎనిమిది దశాబ్దాలుగా ఆనం కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఎప్పుడూ ఎవరిపైనా దాడులు చేసిన సందర్భం లేదు.సీఎం జగన్‌ బెదిరింపులకు భయపడేది లేదు. ఏదైనా ఉంటే.. నేరుగా రండి. పిల్లలకి మందు తాగించి పంపడం కాదు’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు