రాజస్థాన్‌లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌

ప్రధాని మోదీ మొండి వైఖరి కారణంగానే హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకల్లో భాజపా ఓటమి చెందిందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 06 Jun 2023 05:28 IST

రూ.60 కోట్ల రాయితీ పంపిణీ

జైపుర్‌: ప్రధాని మోదీ మొండి వైఖరి కారణంగానే హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకల్లో భాజపా ఓటమి చెందిందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మొండి వైఖరి పనికిరాదని, భాజపా మరిన్ని రాష్ట్రాల్లో ఓడిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్లపై రాయితీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.60 కోట్ల రాయితీ సొమ్ము పంపిణీ చేశారు. దీనిద్వారా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందుతుందని గహ్లోత్‌ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలన్న అప్పటి సీఎం సూచనలను మోదీ పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించారని పేర్కొన్నారు.

మ్యాజిక్‌ షోలు చేసైనా డబ్బులు సంపాదిస్తా

అభివృద్ధి కోసం అవసరమైతే మ్యాజిక్‌ షోలు చేసైనా సరే డబ్బులు సంపాదిస్తానని గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. జోధ్‌పుర్‌లో ‘రావు జోధా మార్గ్‌’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం.. జోధ్‌పుర్‌ ప్రజలకు తాను ప్రథమ సేవకుడినని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మ్యాజిక్‌ చేసైనా డబ్బులు ఆర్జిస్తానుగానీ ప్రజలను నిరాశపరచను అని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని