మీకు బుద్ధి.. జ్ఞానం ఉన్నాయా?..అధికారులపై విరుచుకుపడిన మంత్రి జోగి

విజయవాడలో ఉమ్మడి కృష్ణాజిల్లా సాగునీటి పారుదల సలహా మండళ్ల సమావేశం వేదికపై మంగళవారం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అధికారులపై విరుచుకుపడ్డారు.

Updated : 07 Jun 2023 06:21 IST

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: విజయవాడలో ఉమ్మడి కృష్ణాజిల్లా సాగునీటి పారుదల సలహా మండళ్ల సమావేశం వేదికపై మంగళవారం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అధికారులపై విరుచుకుపడ్డారు. తాను రాగానే.. అధికారులు లేచి నిలబడలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘బుద్ధుందా, జ్ఞానం ఉందా.. మంత్రి, కలెక్టర్లు వస్తే తీరు ఇదేనా? ఒళ్లు జాగ్రత్త’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో, కూర్చున్న అధికారులంతా లేచి నిలబడ్డారు.
నేడు కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల: కృష్ణా డెల్టాకు బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల కలెక్టర్లు ఢిల్లీరావు, రాజబాబు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని