పేదల కోసం ఉరికంబమైనా ఎక్కుతా: ప్రవీణ్‌కుమార్‌

పేదలకు న్యాయం చేయడం కోసం జైలుకు వెళ్లడానికైనా, ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Updated : 07 Jun 2023 04:37 IST

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: పేదలకు న్యాయం చేయడం కోసం జైలుకు వెళ్లడానికైనా, ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఇళ్ల స్థలాల కోసం సుదీర్ఘ పోరాటం చేసి ఇటీవల ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలను మంగళవారం ఆయన కలిసి, వారి సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. ప్రభుత్వ భూమి అంటే పేదల భూమి అని కాన్షీరాం ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు కానీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. పల్లె ప్రకృతివనాలు, క్రీడాప్రాంగణాలు, శ్మశానవాటికల పేరుతో పేదలకు ఎప్పుడో ఇచ్చిన స్థలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. కృష్ణపట్టిలో రెవెన్యూ వారి అండతో ప్రభుత్వ భూములు కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. భారాస రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కొన్ని కుల సంఘాలకు ధారాదత్తం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు