జడ్పీటీసీ సభ్యుడిపై దాడి సైకో పాలనకు నిదర్శనం

వైయస్‌ఆర్‌ జిల్లా గోపవరంలో తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డి ఇంట్లోకి వైకాపా నేతలు, కార్యకర్తలు చొరబడి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం సైకో పాలనకు నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Updated : 07 Jun 2023 06:39 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు-అమరావతి: వైయస్‌ఆర్‌ జిల్లా గోపవరంలో తెదేపా జడ్పీటీసీ సభ్యుడు జయరామిరెడ్డి ఇంట్లోకి వైకాపా నేతలు, కార్యకర్తలు చొరబడి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం సైకో పాలనకు నిదర్శనమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేస్తుంటే జగన్‌రెడ్డి సంతోషించడాన్ని ఏమంటారు? శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు వైకాపా రౌడీ మూకలను కట్టడి చేయకుండా వారికి వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని... జగన్‌రెడ్డి, ఆయన ముఠా గుర్తిస్తే మంచిది. జయరామిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా జరగరానిది జరిగితే జగన్‌రెడ్డే బాధ్యత వహించాలి. దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...’ అని అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని